పాతబస్తీలో జలమండలి అధికారులతో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ శనివారం మధ్యాహ్నం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాకుత్పురా నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉండాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు సరిగా చెల్లిస్తూ ఉండాలని పనులలో జాప్యం వహించరాదని ఆయన సూచించారు.