మధ్యాహ్న భోజన నిర్వాహకులు సమస్యలు పరిష్కరించాలని కొమరాడ మండల సిపిఎం కార్యదర్శి కొల్లి సాంప్రమూర్తి కోరారు. ఆదివారం కొమరాడలో మధ్యాహ్న భోజన నిర్వాహకుల మండల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 13 14 తేదీల్లో పాలకొండలో 11వ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. ఆ సభలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజన నిర్వాహకులు సమస్యలు పరిష్కరించాలన్నారు. సకాలంలో బిల్లులు, జీతాలు ఇవ్వాలన్నారు.