ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో పొగాకు ధరలు గురువారం భారీగా పడిపోయాయి. దీంతో పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మొదట 260 రూపాయల వరకు కేజీ పొగాకు ధర పలకగా 12 రౌండ్ ముగిసేసరికి కేవలం 110 రూపాయలు మాత్రమే పొగాకు ధర పలికింది. దీంతో కొంతమంది రైతులు తెచ్చిన పొగాకును అమ్మకుండా తిరిగి తీసుకువెళ్లారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత మొత్తంలో పొగాకు ధరలు పడిపోలేదని పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.