అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలం, బోయినపల్లి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా జిల్లా ప్రజల చెవిలో పువ్వులు పెట్టి మోసం చేశారని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి పై గంపెడు ఆశలు పెట్టుకున్న ప్రజలకు ఏమి చేస్తారో స్పష్టంగా చెప్పకుండా మోసం చేశాడని విమర్శించారు. బొయనపల్లి ప్రజా వేదిక సభ నుంచి మాట్లాడిన చంద్రబాబు ఆద్యంతం తనను తాను పొగుడుకోవడానికి, వైసిపి ని విమర్శించడానికి పరిమితం అయ్యారని ఇందు కోసం కొట్ల రూపాయల ప్రజా