దేవస్థాన అభివృద్ధి నూతన పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం అనాకోడేరు శ్రీభీమేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించారు. ఛైర్మన్ గా యర్రంశెట్టి వెంకటేశ్వరరావు, 9 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. త్వరలోనే ఈ దేవాలయాన్ని పునః నిర్మాణం చేస్తామని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు.