Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 5, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరు విద్యుత్ డివిజన్ పరిధిలోని అనంతసాగరం, ఆత్మకూరు మండలాలలో నాలుగు ట్రాన్స్ ఫార్మర్లను పగలగొట్టి వాటిలోని వైరు, ఆయిల్ ను దొంగలు దొంగలించారు. అనంతసాగరం, ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాలలో పొలాల వద్ద ట్రాన్స్ ఫార్మర్లను దొంగలు నష్టపరిచినట్లు విద్యుత్ శాఖ ADE చిన్నస్వామి నాయక్ తెలిపారు. దొంగలు చిల్లర ఆదాయం కోసం లక్షలలో నష్టం కలిగిస్తున్నారని అన్నారు. ఈ ఘటనపై పోలీస్ ఫిర్యాదు చేస్తామన్నారు.