పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని భారీ కింగ్ కోబ్రా స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. గొటివాడ పంచాయతీ తెన్నుఖర్జలో శుక్రవారం సుమారు 10 అడుగుల గిరినాగు కనిపించిందని స్థానికులు తెలిపారు. తిమ్మక సోమందొర ఇంటిలో కింగ్ కోబ్రా కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దాంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చామని గ్రామస్థులు తెలిపారు. ఇటీవల కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాలలో గిరి నాగులు కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.