నల్లగొండ జిల్లా కేంద్రంలోని మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి మద్దతుగా నల్లగొండలో మొబైల్ దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. మొబైల్ యూనియన్ పిలుపుమేరకు ఈ బందు నిర్వహించినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ఈ ఉద్యమానికి నల్లగొండ పురిటి గడ్డ కావడం గమనహార్ధం. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వ్యాపారులు, జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ బంధుతో స్థానిక వ్యాపారులకు సంఘీభావం తెలిపినట్లు యూనియన్ నాయకులు తెలిపారు.