ప్యాపిలి మండలం పెద్ద పూజర్ల దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విజయుడు, లక్ష్మీప్రసాద్ మృతదేహాల వద్ద డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి గురువారం నివాళులు అర్పించారు. వారి కుటుంబాలకు పార్టీ అండదండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. డోన్ హైవే దగ్గర జరిగిన యాక్సిడెంట్లో గాయపడిన చిన్న పూజర్ల విష్ణువర్ధన్ రెడ్డి, పుల్లాసి శ్రీరాములును పరామర్శించారు.