ఎరువుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం జలుమూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వాన గోపి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్ ప్రస్తుతం ఎరువుల సమస్యలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తుందన్నారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.