సూర్యాపేట జిల్లా కేంద్రంలోని లంకె బిందెల పేరుతో రూ.20 లక్షలు కాగిసిన సంఘటన కలకలం రేపింది .ఈ సందర్భంగా సోమవారం డిఎస్పి ప్రసన్నకుమార్ తెలిపిన వివరణ ప్రకారం బంగారు నాణేలు దొరికాయని నమ్మించి కేటుగాళ్లు హోటల్ యాజమాన్యం నుంచి డబ్బులు ఎగరవేశారని బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు .ఈ ఘటనలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.13.25 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.