శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ఎర్రగుంటపల్లి జగనన్న కాలనీలో ఇంటి పట్టాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసగించిన ఘటనలో ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా గురువారం కదిరి పట్టణ సిఐ నారాయణరెడ్డి మాట్లాడుతూ పట్టణానికి చెందిన లక్ష్మీ అనే మహిళ కు ఇంటి పట్టా ఆశ చూపి రూ.75వేలు వసూలు చేశారని, పట్టా ఇప్పించకుండా మోసగించిన ఘటనపై ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.