విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మధ్యాహ్నం జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్కు వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జనగామ జిల్లా కన్వీనర్ గుంటుపల్లి కార్తీక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8500 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే కెసిఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని అన్నారు.