నల్లగొండ జిల్లాలోని రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ సందర్భంగా సరైన భద్రత లేని చెరువులు కుంటలకు గండి పడుతుండడంతో పంట నష్టం వాటిల్లుతుందని స్థానికులు తెలుపుతున్నారు. గురువారం నల్లగొండ జిల్లా రామారం గ్రామపంచాయతీ పరిధిలో గండి పడటంతో పక్కనే ఉన్న పంట పొలాలు కొట్టుకుపోయాయి చెరువులకు గండి పడకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.