ప్రతిరోజు యోగా చేయడం వల్ల మెమొరీ పవర్, వర్కింగ్ కెపాసిటీ పెరుగుతుందని అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి తెలిపారు. శుక్రవారం ఉదయం యోగాంధ్ర మాస ఉత్సవాలలో భాగంగా అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నగరపాలక సంస్థ సిబ్బందితో యోగాంధ్రా కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువు ఆంజనేయులు యోగ ఆసనాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ యోగాసనాలను వేయించారు.