ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లిపై రాహుల్ గాంధీ బీహార్ లో మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని బిజెపి జిల్లా అధ్యక్షులు ధోనీ శ్రీశైలం అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం మధ్యాహ్నం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోనీ అంబేడ్కర్ చౌక్ వద్ద రాహుల్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న బీహార్ ఎన్నికల్లో బిజెపి గెలుస్తదని ఆక్రోషంతో రాహుల్ ఇలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. వెంటనే నరేంద్ర మోడీకి రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.