ద్విచక్ర వాహనాన్ని టాటా ఏసీ వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి వతపడ్డారు ఈ ఘటన భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బాంబుల గడ్డ సమీపంలో శుక్రవారం నాలుగు గంటలకు చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి చిట్యాల మండలంలోని బాబు సింగ్ పల్లి గ్రామానికి చెందిన కోడెపాక నరసయ్య అదే గ్రామానికి చెందిన కాల్వల సంజీవని ఇరువురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై గణేష్ చౌక్ నుంచి బాంబులగడ్డ వైపుకు వెళుతున్నారు ఈ క్రమంలో అటుగా వస్తున్నటువంటి టాటా ట్రాలీ వాహనం వీరి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. దీంతో ఇరువురు కింద పడిపోగా తీవ్ర గాయాలయ్యాయి.