రాజీమార్గమే, రాజ మార్గమని నారాయణఖేడ్ జూనియర్ సివిల్ జడ్జి మంథని శ్రీధర్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు నారాయణఖేడ్ కోర్టులో జడ్జి మాట్లాడుతూ సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇరువురి ఒప్పందం మేరకు కేసులు రాజీ చేస్తామని చెప్పారు. కేసులు ఉన్నవాళ్లు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.