కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రెయిన్బో విస్టా రాక్ గార్డెన్ లోని రూబీ బ్లాక్ 10లో ఒక ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి ఒకసారిగా మంటలు చెలరేగడంతో ఇంట్లోని వాసులు బయటకి పరుగులు తీశారు. స్థానికుడు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.