వినాయక పండుగ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని గుత్తి ఎస్ఐ సురేష్ అన్నారు. గుత్తిలోని విరూపాక్షి రెడ్డి కళ్యాణ మండపంలో శనివారం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడారు. అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీజే లు పెట్టడానికి అనుమతి లేదన్నారు. విగ్రహాలు ఏర్పాటు కోసం అనుమతి తీసుకోవాలన్నారు.