ములుగు జిల్లాలో పెద్దపులి మరోసారి కలకలం సృష్టిస్తోంది. గత 2 రోజులుగా పులి సంచరిస్తూ జనాలను హడల్ పుట్టిస్తోంది. ములుగు మండలం పత్తిపల్లి గ్రామ శివారు పొలాల్లో పులి అడుగులను స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న రేంజర్ డోలి శంకర్ పులి అడుగుజాడలను పరిశీలించారు. పత్తిపల్లి, చిన్న గుంటూరు పల్లి పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుందని, ఎవరు కూడా పులికి హాని తల పెట్టొద్దని, కదలికలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని నేడు శుక్రవారం రోజున ఉదయం ఏడు గంటలకు కోరారు.