ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం ప్రకృతి వ్యవసాయం కింద సాగు చేసిన పంటలు, ఆకుకూరలు, పండ్లను ఆహారంగా తీసుకోవాలని వైద్యురాలు తస్లిమా అన్నారు. సోమవారం నంద్యాల జిల్లా బేతంచెర్లపట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో ప్రకృతి వ్యవసాయం కింద సాగు చేసిన పంటలు, ఆకుకూరలు పండ్లను రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రదర్శనగా ఉంచారు. వైద్యుల సలహాలతో పాటు క్రమం తప్పకుండా పౌష్టిక ఆహారం తీసుకోవాలని గర్భిణీలకు సూచించారు.