రాయదుర్గం పట్టణంలో సోమవారం ఉదయం నుండే ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ చేపట్టారు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకూ సర్వర్ మెరాయించడంతో పెన్షన్ కోసం వచ్చిన వంద్దులు వేచి ఉండాల్సి వచ్చింది. 9 తరువాత సర్వర్ పనిచేయడంతో పంపిణీ యధావిధిగా జరిగింది. పట్టణంలోని 9 వ వార్డులో జరిగిన పెన్షన్ల పంపిణీలో రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవశ్రీనివాసులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, రాష్ట్ర పద్మశాలీ కార్పోరేషన్ డైరెక్టర్ పొరాళ్ల పురుషోత్తం, పలువురు మాజీ కౌన్సిలర్లతో కలసి లభ్థదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ సొమ్ము అందజేశారు.