ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామంలో ఆటో డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సహాయం ప్రకటించిన సందర్భంగా శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి టీడీపీ నాయకులవ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు పాలాభిషేకం చేశారు. నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షుడు, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.