తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ ఘటోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉత్సవంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామక్రిష్ణ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. జాతరలో తొలి ఘట్టంగా చెప్పుకునే ఘటోత్సవాన్ని సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ముందుగా కంపాలెంలోని గాలి గంగమ్మల మండపం వద్ద రెడ్డి పెత్తనందారుకు ఆలయ కార్యనిర్వణాధికారి ఆర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి తాంబూలాదులు అందజేశారు. దున్నపోతుకు పూజలు నిర్వహించి జీనిగిలవారి వీధిలో ఉన్న పోలేరమ్మ మెట్టిన ఇల్లు అయిన చాకలి మండపం వద్ద ఘటోత్సవ పూజల ఘనంగా నిర్వహించారు.