జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవనంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా టెక్స్ టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అవగాహన లేని ప్రెస్ మీట్ లు పెట్టి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. సిరిసిల్ల నేత కార్మికులకు 22 నెలలు చేసింది ఏమిటో అంకెలతో వివరించాలని డిమాండ్ చేశారు.తమ హయాంలో చేపట్టిన పనులను ఈ సందర్భంగా గూడూరు ప్రవీణ్ వివరించారు.