కుంటలను ఆక్రమించిన అధికారులు పట్టించుకోరా అని కుంటల వద్ద నిరసన తెలిపిన మహిళలు..కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని తాడికల్లోని మేలకుంటను కొంతమంది ఆక్రమించడంతో దాని విస్తీర్ణం తగ్గి భారీ వర్షానికి కుంట నీరు ఇళ్లలోకి చేరుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు కుంట సమీపంలో శుక్రవారం ఆందోళన తెలిపారు. మండల పరిధిలోని అనేక కుంటలు ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. 4.27 గుంటలున్న కుంట క్రమంగా కుంచించుకుపోయిందని, వెంటనే హద్దులు నిర్ణయించారు.