విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన జనసేన వీర మహిళ కోఆర్డినేటర్ నాగలక్ష్మి చౌదరి శుక్రవారం స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్‌గా విజయవాడలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగ ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అప్పగించన ఈ బాధ్యతను తూ.చ. తప్పకుండా పాటిస్తానని, పదవికి గౌరవం తెచ్చేలా మసలుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం నాగలక్ష్మి చౌదరికి జనసేన వీరమహిళలు, నాయకులు అభినందనలు తెలిపారు.