నారాయణపేట జిల్లా: నారాయణ పేట్ జిల్లా మద్దూర్ మండలం పేదిరిపాడ్ గ్రామ శివారులో రైతు రామాంజనేయులు కు చెందిన బర్రె దూడపై శనివారం రాత్రి దాడి చేసి చంపి వేసింది .రైతు ఆదివారం వ్యవసాయ పోలానికి వేళ్ళి చూడగా చిరుత దాడి చేసినట్లు అనుమానంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని చిరుత పులి దాడి చేసి చంపేసిందని నిర్ధారించారు . గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని , అతి త్వరలో బోన్ వేసి చిరుత పులిని బంధిస్తామని ఫారెస్ట్ అధికారులు తేలిపారు .