భోరజ్ మండలంలోని తర్నం వాగు భారీ వర్షాలకు మంగళవారం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తర్నం తాత్కాలిక బ్రిడ్జి మీదుగా వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో వాగు దగ్గర భారీగా లారీలు నిలిచిపోయాయి. ప్రయాణికులు లాండసాంగి గ్రామం మీదుగా వెళ్లాలని అధికారులు సూచించారు.వాగు ఉద్ధృతిని పోలీసులు, రెవెన్యూ అధికారులు నిరంతరం పర్య వేక్షిస్తున్నారు.