గుడివాడలో యూరియా ఇక్కట్లు, ఒక ఎకరానికి అర బస్తా ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నా రైతులు స్తానిక గుడివాడలో రైతు సేవా కేంద్రంలో యూరియా సరఫరా నామమాత్రంగా జరుగుతోందని మంగళవారం మద్యాహ్నం 3 గంటల సమయంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎకరానికి అర బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారని, అది కూడా పట్టణ రైతులకు మాత్రమే ఇస్తున్నారని వారు వాపోతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.