ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ పరిధిలోని పొట్టితిప్పకు చెందిన గొల్లపల్లి కొండ మంగళవారం కోడి గుడ్లు తీసేందుకు గంపలో చేయి పెట్టగా త్రాచు పాము కాటు వేసింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కొండ ఆ పామును పట్టుకుని నన్నే కాటెస్తావా అంటూ మెల్లో వేసుకుని గ్రామంలో హల్ చల్ చేసాడు. కొండను టి.కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్య సేవల కోసం కాకినాడ తరలించారు.