జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి మాట్లాడుతూ పండుగ సందర్భంలో శాంతి భద్రతలో ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. విగ్రహాలను ఏర్పాటు చేసే ప్రాంతాలలో రాత్రిపూట కమిటీ సభ్యులు ఎవరినైనా వాలంటీర్లను నియమించుకోవాలని వారి జాబితాను సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అలాగే నిమజ్జనం జరిగే రోజున వాహన డ్రైవర్ బ్రీత్ అనాలసిస్ చేయడం జరుగుతుందని తద్వారా ప్రమాదాలను జరగకుండా చూసేందుకు వీలవుతుందని తెలిపారు.సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బృందాలను నియమించి పహారాతో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తామన్నారు.