సఖినేటిపల్లిలోని రేవులన్నీ ముంపునకు గురయ్యాయి. వశిష్ట గోదావరి ప్రవహిస్తుండడంతో పాటు రేవులన్నీ నీట మునిగాయి. దీంతో అప్పారాముని లంక, రామరాజులంక, పెదలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లంక గ్రామ ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. లంక గ్రామాల్లోని ప్రధాన రహదారులు సైతం నీట మునిగాయి.