బుధవారం మధ్యాహ్నం మధ్యాహ్నo గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ లో చిట్యాల ఐలమ్మ 40 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలంగాణ సాయుధ రైతంగ పోరాటానికి పునాదులు వేసింది చిట్యాల ఐలమ్మ అని కొనియాడారు.ఐలమ్మ సాగు చేసిన 4 ఎకరాల భూమిలో పండిన పంటను, నాటి విసునూరు దేశ్ ముఖ్ రామచంద్ర రెడ్డి అక్రమంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసారన్నారు.దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తాను పోరాడటమే కాకుండా,మిగతా కూలీలను సైతం చైతన్యవంతం చేసి ప్రజల కష్టాన్ని దోచుకోకుండా అడ్డుకున్నారని కొనియాడారు..