కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ గ్రామ తాపీ మేస్త్రి & సెంట్రింగ్ కార్మిక సంఘం* ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక హనుమాన్ దేవాలయం ఆవరణలో భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల ఉపాధి క్రమబద్ధీకరణ, నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని లేబర్ ఆఫీసర్ ఎండి రఫీ నిర్వహించారు.ఈ సందర్భంగా కార్మికులకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు.