Araku Valley, Alluri Sitharama Raju | Sep 11, 2025
ముంచింగిపుట్టు మండల పోలీసులు వాహనాల తనిఖీలలో ఆటోలో తరలిస్తున్న 245 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని గురువారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై జె రామకృష్ణ తెలిపారు. మండలంలోని బంగారమెట్ట పంచాయతీ కుజబంగి జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీల్లో గంజాయి పట్టుబడిందని, ముగ్గురు నిందితుల్లో ఇద్దరు పారిపోయారని ఎస్సై తెలిపారు. గంజాయిని ఆటోను సీజ్ చేసి నిందితుడిని రిమాండ్కు పంపించినట్లు ఎస్సై తెలిపారు