బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులై మొదటిసారి మంచిర్యాల జిల్లా కేంద్రానికి వచ్చిన వెరబెల్లి రఘునాథ్కు శుక్రవారం మధ్యాహ్నం పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక ఐబీ చౌరస్తాకు చేరుకున్న ఆయన ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ వెంకటేష్ నేత, పార్టీ జిల్లాధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్తో కలిసి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.