జిల్లాలోని ప్రజలకు సైబర్ వారియర్స్ సైబర్ నేరాలపై అవగాహన పెంచి సైబర్ నేరస్తుల చేతిలో మోసపోకుండా చూడాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని 22 పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉన్న సైబర్ వారియర్స్ తో సమావేశాన్ని నిర్వహించారు.