నార్సింగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మైలారం బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో గాంధీ వర్ధంతి సందర్బంగా పూలమాల వేసి నివాళులు అర్పించి వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన 420 హామీలు, 420 రోజులు పూర్తయ్యాయని నేటికీ పథకాలు అమలు కాలేదని కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపామని, ఏవైతే వాగ్దానాలు చేశారో అవన్నీ నెరవేర్చే విధంగా వారికి జ్ఞానోదయం కలిగించే విధంగా గాంధీజీ వారికి జ్ఞానోదయం చేయాలని మెమోరాండం ఇవ్వడం జరిగిందన్నారు.