దోమకొండ మండలంలోని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. శుక్రవారం ఆయన లింగుపల్లి గ్రామంలో పర్య టించి, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామంలో చెత్తాచెదారం లేకుండా చూడాలని కార్యదర్శి స్నేహాను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.