మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని 2023 ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఓయూ చేసినత టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కోటా శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో మీడియాకు ఆయన వివరాలను తెలిపారు. ఇరువురు 20 ఎకరాల భూమిని అఫీడవిట్ లో చూపించలేదన్న కోట శ్రీనివాస్ సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి సమాచారం తమ వద్ద ఉందని తెలిపారు. తప్పుడు అఫిడవిట్ సమర్పించిన ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.