రాయదుర్గం పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆదివారం సాయంత్రం నుండి పట్టణంలోని ప్రధాన వీధుల్లో వెలసిన గణనాథులు మండపాల వద్ద లడ్డూల వేలం తరువాత ట్రాక్టర్లపై కొలువుదీర్చి ఊరేగింపు ప్రారంభించారు. వేలాది మంది యువతీ యువకులు డిజెలు డోలు వాయిద్యాలకు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి వరకూ ఈ శోభాయాత్ర జరిగే అవకాశం ఉంది.