మంగళవారం తెల్లవారుజామున నాచారం కార్తికేయ నగరకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీరు సాత్విక్ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై వెళ్తున్న సమయంలో డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం ఒక్కసారిగా విరిగి అతని మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.