జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వైద్యుడు పేషంట్ కు సంబంధించిన వారి పై దాడికి పాల్పడ్డాడు.జనగామ లింగాల ఘనపురం మండలం సిరిపురం గ్రామానికి చెందిన పూలమ్మ అనే మహిళ వాంతులు విరోచనాలతో చికిత్స కోసం శనివారం చికిత్స కోసం ఆసుపత్రికి బంధువులు తీసుకొచ్చారు.ఎమర్జెన్సీ పేషెంట్ వెంటనే చికిత్స చేయాలని కోరగా కోపంతో పేషంట్ తరుపున వచ్చిన కర్ణాకర్ అనే వ్యక్తి పై సెలైన్ బాటిల్ తో దాడి చేసాడు.దీంతో దాడిని నిరసిస్తూ ఆసుపత్రి వద్ద రోగికి సంబంధించిన బంధువులు ఆందోళన కు దిగారు.