యాడికి మండలంలో రాకేశ్ అనే 15 ఏళ్ల యువకుడు తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాయలచెరువు గ్రామానికి చెందిన రాకేశ్ అదే గ్రామానికి చెందిన మెకానిక్ జాఫర్ షాప్ వద్ద విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.