తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండలం చిల్లకూరు జాతీయ రహదారిపై ఆదివారం ఎదురేదురుగా రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుడు చిల్లకూరు వడ్డిపాలెం గ్రామానికి చెందిన చమర్తి కిష్టయ్య (38)గా గుర్తించారు. గాయపడిన వ్యక్తి చిరాల రోశయ్య ను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.