పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని పాచిపెంట మండలం పరిధిలో ఉన్న కొటికిపెంట గ్రామ రైతులు శనివారం మధ్యాహ్నం తమ భూములు వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారులు హైవేను ఆనుకుని సైడ్ వాళ్లను నిర్మించారని, అయితే నిర్మాణ సమయంలో తమ భూముల లోనికి వెళ్లేందుకు దారులు చూపుతామని హామీ ఇచ్చారన్నారు. నేడు తమ భూముల్లోనికి వెళ్లేందుకు, పంటలను తీసుకు వచ్చేందుకు ఏమాత్రం అవకాశం లేకుండా సైడ్ వాళ్లను నిర్మించారన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని, తమకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.