ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గం రాపూరులో బుధవారం పర్యటించి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని విమర్శించారు. చంద్రబాబుకి వయసు పెరిగినా ఆలోచన మారలేదని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వెంకటగిరిలో వైసీపీ జెండా ఎగరడం కూడా ఖచ్చితమని తెలిపారు. పార్టీ కార్యకర్తలు కృషి చేస్తూ ప్రజల విశ్వాసం సాధిస్తామన్నారు.