వరదలకు ప్రమాదాల బారిన పడిన వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్ ఫైర్ స్టేషన్ వద్ద నూతన ఫైర్ అండ్ రెస్క్యూ వాహనం, అంబులెన్సును ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. వర్షాల కారణంగా ఏర్పడే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు టోల్ ఫ్రీ 101 లేదా 87126 99392, 87126 99393 నంబర్లకు సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు.